Repentance

కట్టెలపై నీ శరీరం కనిపించదు

Kattelapai Nee Shareeram Kanipinchadu

Watch on YouTube
కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాధ - (2) ||కట్టెలపై|| దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2) కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2) ||ఎన్ని చేసినా|| ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2) కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును (2) ||ఎన్ని చేసినా||