Prayer

కరుణించుము మము పరమ పితా

Karuninchumu Mamu Parama Pithaa

Watch on YouTube
కరుణించుము మము పరమ పితా శరణం నీవే ప్రభు యేసా (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యెరూషలేము చుట్టూను - పర్వతములు ఉంచిన దేవా పరిశుద్ధుల చుట్టును నీవే - నిరతము నుందు నంటివిగా ||హల్లెలూయా|| రాత్రిలో కలుగు భయమేమి - రాకుండ జేయుచుండెదవు రాత్రిలో నీ హస్తముతో - రయముగ కప్పుము ప్రియ తండ్రి ||హల్లెలూయా|| రథమును గుఱ్ఱము రౌతులను - రాత్రిలో చుట్టిరి సిరియనులు రథమును అగ్ని గుఱ్ఱములన్ - రక్షణగా ఉంచిన దేవా ||హల్లెలూయా|| అర్ధ రాత్రిలో యాకోబు - అడవిలో నిద్రించిన గాని ప్రార్ధన చేయుట నేర్పితివి - పరలోక ద్వారము చూపితివి ||హల్లెలూయా||