Good Friday

కలువరి సిలువ సిలువలో విలువ

Kaluvari Siluva Siluvalo Viluva

Watch on YouTube
కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా (2) అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా (2) ||కలువరి|| కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకొన్నావయ్యా వ్యాధులలోన బాధలలోన కన్నీరు తుడిచావయ్యా (2) మధురమైన నీ ప్రేమ మరువగలనా ఆ ప్రేమ (2) అనుక్షణం నీ ఆలోచన నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి|| పాపానికైనా శాపానికైనా రక్తాన్ని కార్చావయ్యా దోషానికైనా ద్వేషానికైనా మరణించి లేచావయ్యా (2) మధురమైన నీ ప్రేమ మరువగలనా ఆ ప్రేమ (2) అనుక్షణం నీ ఆలోచన నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి||