Dedication

కలలాంటి బ్రతుకు నాది

Kalalanti Brathuku Naadi

Watch on YouTube
కలలాంటి బ్రతుకు నాది కన్నీటి ఊట నాది (2) కలలోనైనా ఊహించలేదే కమనీయమైన ఈ బంధం కల్వరిలో సిలువ త్యాగ బంధం (2) ||కలలాంటి|| నేనేమిటో నా గతమేమిటో తెలిసిన వారే క్షమియించలేరే నా నడకేమిటో పడకేమిటో ఎరిగిన వారే మన్నించలేరే హేయుడనై చెడియుండగా.. నా యేసయ్యా ధన్యునిగా నను మార్చినావే (2) ||కలలాంటి|| నేనేమిటో నా విలువేమిటో తెలియకనే తిరుగాడినానే నీవేమిటో నీ ప్రేమేమిటో ఎరుగక నిను నే ఎదిరించినానే హీనుడనై పడియుండగా.. నా యేసయ్యా దీవెనగా నను మార్చినావే (2) ||కలలాంటి||