Christmas

జాగోరే జాగోరే జాగు జాము రాతిరి

Jaagore Jaagore Jaagu Jaamu Raathiri

Watch on YouTube
జాగోరే జాగోరే జాగు జాము రాతిరి యేసు జాము రాతిరి కాడ పుట్టినాడే భాయ్ (2) కన్నియ మరియ కన్నులు విరియ పూత రేకు వంటి బాలుడోయ్ పుట్టె పాకలోన ||జాగోరే|| దూతలు పాడే కమ్మని పాట కబురే తెచ్చింది తారలు మెరిసే తీరును చూడ వెలుగే వచ్చింది (2) వెళ్లి గొల్లలు తేరి చూసిరి – ఘల్లు ఘల్లున చిందులు వేసిరి (2) ఈ ప్రజల నేలె యేసయ్య వచ్చెనని పరుగులు తీసిరమ్మా ||జాగోరే|| వెలుగులు చిందే తారను చూసి తరలిరి జ్ఞానులమ్మా బోళము తెచ్చి కానుకలిచ్చి సాగిలపడిరమ్మా (2) పోలి కేక పెట్టెనమ్మా – పొలిమేర దాటెనమ్మా (2) ఆ పసిడి కిరణాల బాలుని చూసి ప్రకృతి మురిసెనమ్మా ||జాగోరే||