హృదయమనెడు తలుపు నొద్ద - యేసు నాథుండు
నిలచి - సదయుడగుచు దట్టుచుండు - సకల విధములను (2)
||హృదయ||
పరుని బోలి నిలుచున్నాడు - పరికించి చూడ
నతడు - పరుడు గాడు రక్షకుండు - ప్రాణ స్నేహితుడు (2)
||హృదయ||
కరుణా శీలుండతడు గాన - గాచి యున్నాడు
యేసు - కరుణ నెరిగి గారవింప - గరము న్యాయంబు (2)
||హృదయ||
ఎంత సేపు నిలువ బెట్టి - యేడ్పింతు రతని
నాత - డెంతో దయచే బిలుచుచున్నా - డిప్పుడు మిమ్ములను (2)
||హృదయ||
అతడు మిత్రుడతడు మిత్రుం - డఖిల పాపులకు
మీర - లతని పిలుపు వింటి రేని - యతడు ప్రియుడగును (2)
||హృదయ||
జాలి చేత దన హస్తముల - జాపి యున్నాడు
మిమ్ము - నాలింగనము సేయ గోరి - యనిశము కనిపెట్టు (2)
||హృదయ||
సాటిలేని దయగల వాడు - సర్వేశు సుతుడు
తన - మాట వినెడు వారల నెల్ల - సూటిగ రక్షించు (2)
||హృదయ||
చేర్చుకొనుడి మీ హృదయమున - శ్రీ యేసునాథు
నతడు - చేర్చుకొనుచు మీ కిచ్చును - చీర జీవము కృపను (2)
||హృదయ||
అతడు తప్పక కలుగజేయు - నఖిల భాగ్యములు
మీర - లతని హత్తుకొందు రప్పు - డానందము తోడ (2)
||హృదయ||
బ్రతుకు శాశ్వతంబు కాదు - పరికించు చూడు
గాన - బ్రతికి యుండు కాలముననే - ప్రభుని గొలువండి (2)
||హృదయ||
