Praise
హల్లెలూయా ఆరాధన రాజాధి రాజు యేసునకే
Halleluuya Aaraadhana Raajaadhi Raaju Yesunake
హల్లెలూయా ఆరాధన
రాజాధి రాజు యేసునకే
మహిమయు ఘనతయు
సర్వాధికారి క్రీస్తునకే (2)
చప్పట్లు కొట్టుచూ - పాటలు పాడుచూ
ఆ ప్రభుని కీర్తించెదం
నాట్యము చేయుచు - ఉత్సాహ ధ్వనులతో
స్తోత్రార్పణ చేసెదం
||హల్లెలూయా||
రూపింప బడక ముందే
నన్ను ఎరిగితివి
నా పాదములు జారకుండా
రక్షించి నడిపితివి (2)
||చప్పట్లు||
అభిషేక వస్త్రము నిచ్చి
వీరులుగా చేసితివి
అపవాది క్రియలను జయించే
ప్రార్థన శక్తినిచ్చితివి (2)
||చప్పట్లు||
