Praise

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని

Goppa Devudavani Shakthi Sampannudani

Watch on YouTube
గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదన్ హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా (2) ||గొప్ప|| అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలడని (2) అద్వితీయుడవని ఆదిసంభూతుడని ఆరాధించెద నిత్యం నిన్ను (2) ||హల్లెలూయా|| సాగరాన్ని రెండుగా చేసినాడని సాతాను శక్తులను ముంచినాడని (2) సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష్య గీతం నే పాడెదన్ (2) ||హల్లెలూయా||