Evangelism

గూడు లేని గువ్వనై కూడు లేని బిడ్డనై

Goodu Leni Guvvanai Koodu Leni Biddanai

Watch on YouTube
గూడు లేని గువ్వనై - కూడు లేని బిడ్డనై (2) నీడ లేని మనిషినై - అందరిలో ఒంటరినై (2) దారి తెలియని స్థితిలో నిలబడి ఉన్నాను సహాయము కొరకు ఆర్జిస్తు ఉన్నాను (2) అప్పుడొక మెల్లని స్వరము నాతో మాట్లాడి చెప్పెను ప్రభువైన యేసుని (2) ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను నా జీవితమంత ప్రకాశింప సాగింది (2) ||గూడు|| అప్పుడొక తియ్యని స్వరము నాతో మాట్లాడి చెప్పెను ప్రియుడైన యేసుని (2) ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను నా పాప జీవితము పారిపో సాగింది (2) ||గూడు|| అప్పుడొక అద్భుత స్వరము నాతో మాట్లాడి చెప్పెను రాజైన యేసుని (2) ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను నా ప్రశ్నలన్నిటికి జవాబులు దొరికాయి (2) గూడు ఉన్న గువ్వనై - కూడు ఉన్న బిడ్డనై (2) నీడ ఉన్న మనిషినై - ఒక్కరిలో వెయ్యినై (2) దారి తెలిసిన స్థితిలో నిలబడి ఉన్నాను సేవలోని మాధుర్యము ననుభవిస్తున్నాను (2) యేసుని నమ్ముకో - యేసుని చేరుకో యేసుని కోరుకో - యేసుతో చేరిపో (4)