Second Coming
గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
Gaganamu Cheelchukoni Ghanulanu Theesukoni
గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ రానైయున్న
ప్రాణప్రియుడా యేసయ్యా (2)
నిన్ను చూడాలని…
నా హృదయమెంతో ఉల్లసించుచున్నది (2)
ఉల్లసించుచున్నది…
||గగనము||
నీ దయా సంకల్పమే - నీ ప్రేమను పంచినది
నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది (2)
పవిత్రురాలైన కన్యకగా - నీ యెదుట నేను నిలిచెదను (2)
నీ కౌగిలిలో నేను విశ్రమింతును (2)
||గగనము||
నీ మహిమైశ్వర్యమే - జ్ఞాన సంపదనిచ్చినది
మర్మమైయున్న నీవలె రూపించుచున్నది (2)
కళంకములేని వధువునై - నిరీక్షణతో నిన్ను చేరెదను (2)
యుగయుగాలు నీతో ఏలెదను (2)
||గగనము||
నీ కృపా బాహుళ్యమే - ఐశ్వర్యమునిచ్చినది
తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది (2)
అక్షయమైన దేహముతో - అనాది ప్రణాళికతో (2)
సీయోనులో నీతో నేనుందును (2)
||గగనము||
