Thanksgiving
గడిచిన కాలమంతా నను నడిపిన నా దేవా
Gadichina Kaalamanthaa Nanu Nadipina Naa Devaa
గడిచిన కాలమంతా - నను నడిపిన నా దేవా
నీ కంటి పాప లాగా - కాపాడిన నా ప్రభువా (2)
మరో యేడు నాకొసగినందుకు - నీకేమి నే చెల్లింతును
నీ ప్రేమను పంచినందుకు - నిన్నేమని కీర్తింతును (2)
||గడిచిన||
ఇచ్చిన వాగ్ధానం మరువక - నిలుపు దేవుడవు
శూన్యమందైనా సకలం - సాధ్యపరచెదవు (2)
నా మేలు కోరి నీ ప్రేమతో - నను దండించితివి
చెలరేగుతున్న డంభమును - నిర్మూలపరచితివి (2)
||మరో యేడు||
నాదు కష్ట కాలములోన - కంట నీరు రాకుండా
నాదు ఇరుకు దారుల్లోన - నేను అలసిపోకుండా (2)
నా సిలువ భారం తగ్గించి - నీవేగా మోసితివి
నీ ప్రేమతో పోషించి - సత్తువ నింపితివి (2)
||మరో యేడు||
