ఎవరితో నిన్ను పోల్చగలనయ్యా
ఏమని నిన్ను పొగడగలనయ్యా
అద్వితీయుడవు ఆశ్చర్యకరుడవు
బలవంతుడైన సమాధాన కర్తవు నీవు (2)
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్న శాసనాలు మార్చినావయ్యా
మరణ భయమున కృంగియున్న జనులకు
విడుదల ప్రకటించినావయ్యా (2)
నరుని కోసమై భువికి వచ్చిన
ఏకైక దేవుడవు నీవయ్యా
మరణ మొందగా పరము వీడిన
నీవంటి దేవుడు ఎవరు యేసయ్యా
||అద్వితీయుడవు||
పాప భారము మా ప్రయాసము సిలువలో తొలగించినావయ్యా
నీదు ప్రజలకు సమాధానము
కృపతో స్థిరపరచినావయ్యా (2)
మృతిని గెలిచిన సత్యవంతుడా
నీవంటి దేవుడు ఎవరులేరయ్యా
జీవ మార్గము మాకు చూపిన
నిన్ను పోలి ఎవరు లేరు యేసయ్యా
||అద్వితీయుడవు||
