Worship

ఎంత మధురము యేసుని ప్రేమ

Entha Madhuramu Yesuni Prema

Watch on YouTube
ఎంత మధురము యేసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ (2) ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా (2) ||ఎంత మధురము|| అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని (2) బంధము తెంచెను బ్రతికించెను నన్ను (2) ||ప్రేమా|| రక్షించు వారు లేక పక్షినైతిని భక్షకుడు బాణము గురి పెట్టియుండెను (2) బంధము తెంచెను బ్రతికించెను నన్ను (2) ||ప్రేమా||