Worship

ఎంత కృపామయుడవు యేసయ్యా

Entha Krupamayudavu Yesayyaa

Watch on YouTube
ఎంత కృపామయుడవు యేసయ్యా (నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా (2) నలిగితివి వేసారితివి (2) నాకై ప్రాణము నిచ్చితివి (2) ||ఎంత|| బండలాంటిది నాదు మొండి హృదయం ఎండిపోయిన నాదు పాత జీవితం (2) మార్చినావు నీ స్వాస్థ్యముగా (2) ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము (2) ||ఎంత|| కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూ ఈ లోకము నన్ను విడచిననూ (2) మరువలేదు నన్ను విడువలేదు (2) ప్రేమతో పిలచిన నాథుడవు (2) ||ఎంత|| కరువులు కలతలు కలిగిననూ లోకమంతా ఎదురై నిలచిననూ (2) వీడను ఎన్నడు నీ సన్నిధి (2) నీ త్యాగమునే ధ్యానించెదన్ (2) ||ఎంత||