Worship

ఎనలేని ప్రేమ నాపైన చూపి

Enaleni Prema Naapaina Choopi

Watch on YouTube
ఎనలేని ప్రేమ నాపైన చూపి నరునిగా వచ్చిన నా దేవా నా పాపము కొరకు రక్తమును కార్చి ప్రాణమునర్పించిన నా దేవా (2) ఊహించగలనా వర్ణింప తగునా ఆ గొప్ప సిల్వ త్యాగము (2) ఆ గొప్ప సిల్వ త్యాగము ||ఎనలేని|| కొరడాలతో హింసించినా మోముపై ఉమ్మి వేసినా (2) చెమట రక్తముగా మారినా (2) ||ఊహించగలనా|| ముళ్ల కిరీటముతో మొత్తినా బల్లెముతో ప్రక్క పొడచినా (2) పరలోక తండ్రియే చేయి విడచినా (2) ||ఊహించగలనా||