Prayer

ఈ ఉదయం – శుభ ఉదయం

Ee Udayam Shubha Udayam

Watch on YouTube
ఈ ఉదయం - శుభ ఉదయం ప్రభువే నాకొసగిన - ఆనంద సమయం ఆశ్రయించెదన్ - దివ్య వాక్యమున్ ప్రేమతోడ సరిచేసే - శ్రేష్ఠ సత్యమున్ ||ఈ ఉదయం|| బలహీనమైతి నేను - బలపరచుము తండ్రి ఫలహీనమైతి నేను - ఫలియింపజేయుము వాక్య ధ్యానమే - నీ ముఖ దర్శనము పరిశుద్ధ పరచెడి - పరమతండ్రి మార్గము ||ఈ ఉదయం|| అస్థిరమునైతి నేను - స్థిరపరచుము తండ్రి అల్పవిశ్వాసి నేను - అద్దరికి జేర్చుము నీ పాదసన్నిధే - నాకు శరణము అభయంబునిచ్చెడి - ఆశ్రయపురము ||ఈ ఉదయం||