ఈ సాయంకాలమున - యేసు ప్రభో వేడెదము
నీ సుదయారస మొల్క - నిత్యంబు మముగావు
||ఈ సాయంకాలమున||
చెడ్డ కలల్ రాకుండ - నడ్డగించుమి ప్రభో
బిడ్డలము రాత్రిలో - భీతి బాపుము తండ్రీ
||ఈ సాయంకాలమున||
దుష్టుండౌ శోధకుని - ద్రోక్కుటకు బలమిమ్ము
భ్రష్టత్వమున మేము - పడకుండ గాపాడు
||ఈ సాయంకాలమున||
నీ యేక పుత్రుండౌ - శ్రీయేసు నామమున
సాయం ప్రార్థన లెల్ల - సరగ నాలించుమా
||ఈ సాయంకాలమున||
జనక సుత శుద్ధాత్మ - ఘన దేవా స్తుతియింతుం
అనిశము జీవించి - రా - జ్యంబు జేయు మామేన్
||ఈ సాయంకాలమున||
