Worship

ఈ దినం సదా నా యేసుకే సొంతం

Ee Dinam Sadaa Naa Yesuke Sontham

Watch on YouTube
ఈ దినం సదా నా యేసుకే సొంతం నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును (2) రానున్న కాలము - కలత నివ్వదు (2) నా మంచి కాపరీ సదా - నన్ను నడుపును ||ఈ దినం|| ఎడారులు లోయలు ఎదురు నిలచినా ఎన్నడెవరు నడువని బాటయైనను (2) వెరవదెన్నడైనను నాదు హృదయము (2) గాయపడిన యేసుపాదం అందు నడచెను (2) ||ఈ దినం|| ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా యుద్ధకేక నా నోట యేసు నామమే విరోదమైన ఆయుధాలు యేవి ఫలించవు యెహోవా నిస్సియే నాదు విజయము ||ఈ దినం||