దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను (2)
నిన్ను నన్ను ధరలో ప్రతి వారిని (2)
ఎంతో ప్రేమించెను ప్రేమించి ఏతెంచెను
||దేవుడు||
పరలోక ప్రేమ ఈ ధరలో
ప్రత్యక్షమాయె ప్రతివానికై (2)
ఆదియందున్న ఆ దేవుడు
ఏతెంచె నరుడై ఈ భువికి (2)
ఈ ప్రేమ నీ కొరకే - జన్మించే ఇల యేసు నీ కొరకే (2)
||దేవుడు||
పాపంధకారములో అంధులుగా
చీకటి త్రోవలో తిరుగాడగా (2)
జీవపు వెలుగైన ఆ ప్రభువు
వెలిగించగా వచ్చెను ప్రతి వారిని (2)
ఈ వెలుగు నీ కొరకే - యేసు నిన్నిల వెలిగించును (2)
||దేవుడు||
