Worship

దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం

Devaa Nee Aavaranam Maakentho Shreyaskaram

Watch on YouTube
దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం (2) ఒక ఘడియ యిచట గడుపుట మేలు వేయి దినములకంటెను (2) ||దేవా|| అద్బుత కార్యములు ఆ… జరిగించు దేవుడవు ఆ…. (2) అనవరతమునీ మహిమలు పొగడ ఆత్మలో నిలుపుమయా అత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో (2) ఆల్ఫా ఓమేగయు ఆత్మ రూపుడవు ఆనందించగ నీ ఒడిలో (2) ||దేవా|| అత్యంత పరిశుద్ధమౌ ఆ…. నీదు గుడారమున ఆ….. (2) నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము హెచ్చించితివి నీ దయన్ జు౦టె ధారల కన్నను తేనె మధురిమ కన్నను (2) శ్రేష్టమౌ నీదు వాక్కులచేత మము తృప్తి పరచుమయా (2) ||దేవా|| పరిశుద్ధ సన్నిధిలో ఆ… పరిశుధ్దాత్ముని నీడలో ఆ…. (2) పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదం మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం (2) ప్రాణ ప్రియుడవు పదముల జేరి ప్రాణార్పణము చేతుము (2) ||దేవా||