దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా దేవుని
పావన నామము నుతించుమా - నా యంతరంగము
లో వసించు నో సమస్తమా
||దేవ||
జీవమా, యెహోవా నీకు - జేసిన మేళ్ళన్ మరువకు (2)
నీవు చేసిన పాతకంబులను - మన్నించి జబ్బు
లేవియున్ లేకుండ జేయును - ఆ కారణముచే
||దేవ||
చావు గోతినుండి నిన్ను - లేవనెత్తి దయను గృపను (2)
జీవ కిరీటముగ వేయును - నీ శిరసు మీద
జీవ కిరీటముగ వేయును - ఆ కారణముచే
||దేవ||
యవ్వనంబు పక్షిరాజు - యవ్వనంబు వలెనే క్రొత్త (2)
యవ్వనంబై వెలయునట్లుగా - మే లిచ్చి నీదు
భావమును సంతుష్టిపరచునుగా - ఆ కారణముచే
||దేవ||
ప్రభువు నీతి పనులు చేయును - బాధితులకు న్యాయ మిచ్చున్ (2)
విభుండు మార్గము తెలిపె మోషేకు - దన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే
||దేవ||
అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2)
నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు
నీ పయి నెపుడు కోప ముంచడు - ఆ కారణముచే
||దేవ||
పామరుల మని ప్రత్యుపకార - ప్రతి ఫలంబుల్ పంపలేదు (2)
భూమి కన్న నాకాసంబున్న - ఎత్తుండు దైవ
ప్రేమ భక్తి జనులయందున - ఆ కారణముచే
||దేవ||
పడమటికి తూర్పెంత ఎడమో - పాపములను మనకు నంత (2)
ఎడము కలుగజేసియున్నాడు - మన పాపములను
ఎడముగానే చేసియున్నాడు - ఆ కారణముచే
||దేవ||
కొడుకులపై తండ్రి జాలి - పడు విధముగా భక్తిపరుల (2)
యెడల జాలి పడును దేవుండు - తన భక్తిపరుల
యెడల జాలిపడును దేవుండు - ఆ కారణముచే
||దేవ||
మనము నిర్మితమయిన రీతి - తనకు దెలిసియున్న సంగతి (2)
మనము మంటి వారమంచును - జ్ఞాపకము చేసి
కొనుచు కరుణ జూపుచుండును - ఆ కారణముచే
||దేవ||
పూసి గాలి వీవ నెగిరి - పోయి బసను దెలియని వన (2)
వాస పుష్పము వలెనె నరుడుండు - నరు నాయువు తృణ
ప్రాయము మన దేవ కృప మెండు - ఆ కారణముచే
||దేవ||
పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు (2)
నిరతమును గృప నిలిచి యుండును - యెహోవ నీతి
తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే
||దేవ||
