Repentance

దేహం పాతది మనసు మలినమైనది

Deham Paathadi Manasu Malinamainadi

Watch on YouTube
దేహం పాతది - మనసు మలినమైనది జీవం పాపిది - మార్గం తెలియనిది (2) సర్వోన్నతుడా నిత్య నూతనుడా నిత్య జీవనం కలిగించుమయ్యా మరియా కన్న తనయా ||దేహం|| దాహంతో నువ్వు నీళ్ళను అడిగితే ఇవ్వకపోయానే ఆకలిగొని నువ్వు రొట్టెను అడిగితే పెట్టకపోయానే తల దాచుకునే ఆశ్రయమడిగితే పో అని అన్నానే మానము కాచగ వస్త్రమునడిగితే లేదని అన్నానే ||సర్వోన్నతుడా|| తెలిసీ తెలియక చేసిన తప్పులు ఉన్నవి మన్నించు తండ్రివి నీవే నా చేయిని నువ్వు పట్టి నడిపించు వీడగ లేని సంసారమనే బంధం విడిపించు నీపై మనసు నిలిచే విధమును నువ్వే నేర్పించు ||సర్వోన్నతుడా||