వాక్యమే శరీర ధారియై - లోక రక్షకుడు ఉదయించె
పాపాన్ని శాపాన్ని తొలగింపను - రక్షకుడు భువికేతెంచెను
ఊరు వాడా వీధులలో - లోకమంతా సందడంటా
ఆడెదము కొనియాడెదము - అరే పూజించి ఘనపరచెదం
చుక్క పుట్టింది ఏలో ఏలేలో - సందడి చేద్దామా ఏలో
రాజు పుట్టినాడు ఏలో ఏలేలో - కొలవబోదామా ఏలో
గొర్రెల విడచి మందల మరచి
గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మా
గానములతో గంతులు వేస్తూ
గగనాన్నంటేలా ఘనపరచెదం (2)
చీకట్లో కూర్చున్న వారి కోసం - నీతి సూర్యుడేసు ఉదయించే
పాపాన్ని శాపాన్ని తొలగింపను - పరమును చేర్చను అరుదించే
ఈ బాలుడే మా రాజు - రాజులకు రారాజు
ఇహం పరం అందరము
జగమంతా సందడి చేద్దాం
చుక్క పుట్టింది ఏలో ఏలేలో - సందడి చేద్దామా ఏలో
పొలమును విడచి ఏలో ఏలేలో - పూజ చేద్దామా ఏలో
తారను చూచి తరలి వచ్చాము
తూర్పు దేశపు జ్ఞానులము
తన భుజముల మీద రాజ్య భారమున్న
తనయుడెవరో చూడ వచ్చామమ్మా (2)
బంగారు సాంబ్రాణి బోళములు - బాలునికి మేము అర్పించాము
మా గుండెల్లో నీకేనయ్యా ఆలయం - మా మదిలో నీకేనయ్యా సింహాసనం
ఈ బాలుడే మా రాజు - రాజులకు రారాజు
ఇహం పరం అందరము
జగమంతా సందడి చేద్దాం
చుక్క పుట్టింది ఏలో ఏలేలో - సందడి చేద్దామా ఏలో
జ్ఞాన దీప్తుడమ్మా ఏలో ఏలేలో - భువికేతెంచెనమ్మా ఏలో
నీవేలే మా రాజు - రాజులకు రాజు
నిన్నే మేము కొలిచెదము - హోసన్న పాటలతో
మా హృదయములర్పించి - హృదిలో నిను కొలిచి
క్రిస్మస్ నిజ ఆనందం - అందరము పొందెదము
