చూచితి నీ మోముపై - చిందిన రక్తము
తలచితి నీ ప్రేమను - మదికి అందనిదాయె
రాజ మకుటము మారిపోయే - ముళ్ల మకుటముగా
సింహాసనమే సిలువగ మారి - శిక్షకు గురియాయేగా
పరిమితి లేని కలువరి ప్రేమను - పరిహాసము చేసిరే
ఆ ప్రేమనెరిగి నీ పాద సేవయే - చాలని నీ చెంత చేరితిని
యేసు..
||చూచితి||
నేలపై ఒలికిన నీ రక్తధారలే - ప్రతి పాపిని కడిగెను
ఆ రక్తధారలే పాపికి మార్గమై - పరముకు ప్రవహించెను (2)
మట్టి దేహమును - మహిమగ మార్చుటకు (2)
మాపై నీకున్న సంకల్ప ప్రేమను - పరిహాసము చేసిరే (2)
యేసు..
||చూచితి||
సిలువలో చిందిన రక్తపు జల్లులు - ప్రతి రోగిని తాకెను
చితికిన దేహమున ఒలికిన రుధిరము - పరమౌషధమాయెను (2)
మా రోగములను - భరియించుటకు (2)
మాపై నీకున్న ఎనలేని ప్రేమను - అవహేళన చేసిరే (2)
యేసు..
||చూచితి||
