Praise
భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణ కర్తా
Bhajiyinthumu Ninu Jagadeeshaa Sri Yesaa Maa Rakshana Karthaa
భజియింతుము నిను జగదీశా శ్రీ
యేసా మా రక్షణ కర్తా (2)
శరణు శరణు మా దేవా యెహోవా
మహిమాన్విత చిర జీవనిధి (2)
||భజియింతుము||
విమల సెరాపులు దూత గణంబులు
చూడగ లేని తేజోనిధివే (2)
మా యధములకై సిలువ మ్రానుపై
దీనుడవై మరణించితివే (2)
||శరణు||
ప్రప్రధముడ మరి కడపటి వాడా
మృతుడై బ్రతికిన నిరత నివాసి (2)
నీ భజనలు మా జీవనాధారం
చేకొనవే మా స్తుతి గీతం (2)
||శరణు||
