Encouragement

తెల్లారింది వేళ

Annayya Thellaarindi Leraa

Watch on YouTube
అన్నయ్య… తెల్లారింది లేరా.. తెల్లారింది వేళ - త్వరగా నిద్దుర లేరా మనమంతా ఆయన సృష్టే రా పక్షుల కోలాహ వేళ - ప్రభువును స్తుతించావేరా వాటి కంటె శ్రేష్ఠుల మనమేరా (2) అడవి రాజు సింహమైననూ - ఆకలంటు పిల్లలన్ననూ యేసు రాజు పిల్లలం మనం - పస్తులుంచునా (2) వాడిపోవు అడవి పూలకు - రంగులేసి అందమిచ్చెను రక్తమిచ్చి కొన్న మనలను - మరచిపోవునా (2) మరచిపోవునా ||తెల్లారింది|| చిన్నదైన పిచ్చుకైననూ - చింత ఉందా మచ్ఛుకైననూ విత్తలేదు కోయలేదని - కృంగిపోవునా (2) వాటికన్ని కూర్చువాడు - నీ తండ్రి యేసేనని నీకు ఏమి తక్కువ కాదని - నీకు తెలియునా (2) నీకు తెలియునా ||తెల్లారింది||