Christmas

ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండి గొల్లలు

Aelo Aelo Aelo Antoo Vachcharandi Gollalu

Watch on YouTube
ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలెస్సా దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండి హైలెస్సా అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు నిన్నే కోరి నిన్నే చేరి ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు ||ఏలో|| లోకాలనేలేటి రారాజురా ఉదయించే సూరీడై వచ్చాడురా ఆకాశ వీధి మెరిసేటి దారి ఒక తార మురిసిందిగా (2) దూతాళి పాడి కొలిచారు చూడు ఘనమైన ఒక వేడుక ఆ గొల్లలేగా దరువేసే చూడు మెస్సయ్య పుట్టాడని మన మెస్సయ్య పుట్టాడని ||ఏలో|| వెన్నెల్లో పూసింది ఓ సందడి పలికింది ఊరంతా ఈ సంగతి ఈ దీనుడంట పసిబాలుడంట వెలిసాడు మహరాజుగా (2) మనసున్నవాడు దయ చూపువాడు అలనాటి అనుబంధమే కనులారా చూడు మనసారా వేడు దిగి వచ్చె మనకోసమే ఇల దిగి వచ్చె మనకోసమే ||ఏలో|| ఆ నింగి తారల్లా వెలగాలిరా జగమంత చూసేలా బ్రతకాలిరా వెలిగించు వాడు మనలోని వాడు నిలిచాడు మన తోడుగా (2) సలి గాలి రాత్రి పిలిసింది సూడు మనలోన ఒక పండగ భయమేల నీకు దిగులేల నీకు యేసయ్య మనకుండగా మన యేసయ్య మనకుండగా ||ఏలో||