Prayer

ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా

Aathma Varshamunu Kummarincayya

Watch on YouTube
ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా (2) నీ ఆత్మ చేత అభిషేకించి (2) నీ కృప చేత బలపరచయ్యా (2) నే ఉన్నది నీ కోసమే యేసయ్యా నీ సింహాసనం చేరితినయ్యా ||ఆత్మ|| బలహీనతతో నన్ను బలపరచుము ఒంటరైన వేళలో ధైర్యపరచుము (2) కృంగిన వేళ నీ దరి చేర్చి (2) నీ ఆత్మ శక్తితో బలపరచయ్యా (2) ||నే ఉన్నది|| ఆత్మీయుడవై నన్ను ఆదరించుము అలసిన వేళ దర్శించుము (2) అవమానములో నీ దరి చేర్చి (2) నీ ఆత్మ శక్తితో స్థిరపరచయ్యా (2) ||నే ఉన్నది||