ఆరని ప్రేమ ఇది - ఆర్పజాలని జ్వాల ఇది (2)
అతి శ్రేష్టమైనది - అంతమే లేనిది
అవధులే లేనిది - అక్షయమైన ప్రేమ ఇది (2)
కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2)
||ఆరని||
సింహాసనము నుండి - సిలువకు దిగి వచ్చినది
బలమైనది మరణము కన్నా - మృతిని గెల్చి లేచినది (2)
ఇది సజీవమైనది - ఇదే సత్యమైనది
ఇదే నిత్యమైనది - క్రీస్తు యేసు ప్రేమ ఇది (2)
కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2)
||ఆరని||
నా స్థానమందు నిలిచి - నా శిక్షనే భరియించి
క్రయ ధనమును చెల్లించి - గొప్ప రక్షణ నిచ్చినది (2)
నాకు విలువ నిచ్చినది - నన్ను వెలిగించినది
ఆ ఉన్నత రాజ్యమందు - నాకు స్థానమిచ్చినది (2)
ఉన్నత ప్రేమ ఇది - అత్యున్నత ప్రేమ ఇది (2)
||ఆరని||
భూ రాజులు అధిపతులు - రాజ్యాలు అధికారాలు
చెరయైనా ఖడ్గమైనా - కరువైనా ఎదురైన (2)
ఎవరు ఆర్పలేనిది - ఎవరు ఆపలేనిది
ప్రవహించుచున్నది - ప్రతి పాపి చెంతకు (2)
ప్రేమ ప్రవాహమిది - యేసు ప్రేమ ప్రవాహమిది (2)
||ఆరని||
