Praise

ఆనందముగా యెహోవా నీ కృపలన్ని

Aanandamugaa Yehovaa Nee Krupalanni

Watch on YouTube
ఆనందముగా యెహోవా నీ కృపలన్ని అన్ని కాలంబులందు కీర్తించెదన్ (2) చావు గోతినుండి లెవనెత్తి నాకు - జీవమిచ్చిన జీవ దాత వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో సవ్యంబుగా ఈ భువియందున ||ఆనందముగా|| సింహపు పిల్లలు - ఆకలిగొనిన - యెహొవ సహాయుడందరికి ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు అహా ఏమందు నీ విశ్వాస్యతన్ ||ఆనందముగా|| ఎన్నెన్నో శోధన బాధలు రేగి - నన్ను కృంగదీయ పోరాడినన్ ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్ ||ఆనందముగా|| పర్వతంబులు - పారిపోయినను - ఉర్విలో మార్పు కలిగిననూ తరుణములు విరోధముగపై లేచినా స్మరియించెద నీ విశ్వాస్యతన్ ||ఆనందముగా||