Christmas
ఆకాశమే పట్టనోడు - ధరణిలో పుట్టినాడు
Aakashame Pattanodu - Dharanilo Puttinaadu
అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని చూడరే
పుడమియే పరవశించె పసిబాలుని చూడగనే పసిబాలుని చూడగనే
ఆకాశమే పట్టనోడు - ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై - వెలసినాడు రక్షకుడు (2)
ఆనందమే మహా ఆనందమే - అందరికి ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే - యేసు జననం అద్భుతమే (2)
అదృశ్య దేవుని మహిమ స్వరూపుడు
ఆది అంతమైన పరలోక నాథుడు (2)
ఆదియందు వాక్యంబుగా - సృష్టి కార్యము జరిగించినాడు
అనాది నుండి జ్ఞానంబుగా - సృష్టి క్రమము నడిపించినాడు (2)
అన్నిటిని కలిగించిన మహరాజు
కన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు (2)
||ఆనందమే||
ప్రేమను పంచే ప్రేమామయుడు
రక్షణ ఇచ్చే రక్షించే దేవుడు (2)
పాపమే లేని సుగుణాల సుందరుడు
శాపము బాపను జన్మించెను చూడు (2)
నిత్యముండు నీతి సూర్యుడు - సత్యసాక్షిగా ఇలకొచ్చినాడు
ప్రేమను పంచే పావనాత్ముడు - పశుల పాకలో పవళించినాడు (2)
సర్వాధికారియైన మహరాజు
దీనులకు దీవెనగా దిగి వచ్చినాడు (2)
||ఆనందమే||
||ఆకాశమే||
