Worship

ఆహా ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగె నాకు

Aahaa Aanandame Paramaanandame Priya Yesu Nosage Naaku

Watch on YouTube
ఆహా ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగె నాకు కొలత లేనిది బుద్ధికందనిది ప్రేమన్ వివరింప వీలగునా ||ఆహా|| నీచ ద్రోహినైన నన్ ప్రేమతో చేర్చుకొనే (2) పాప ఊభి నుండి నన్ పైకి లేవనెత్తెను (2) ||ఆహా|| నిత్య నాశన పురమునకు నే పరుగిడి వెళ్ళుచుండ (2) నిత్య జీవ మార్గములో నన్ను నడిపితివి (2) ||ఆహా|| నీ ప్రేమ స్వరమున్ విని నేను మేలుకొంటిని (2) ప్రియుని రొమ్మును చేరను నాలో వాంఛ ఉప్పొంగుచుండె (2) ||ఆహా|| మధ్యాకాశము నందున ప్రభుని చేరెడు వేళలో (2) ఆనందమానందమే ఎల్లప్పుడానందమే (2) ||ఆహా||