ఆ రాజే నా రాజు - నా రాజే రారాజు
నా రాజు రాజులకు రాజు (2)
యేసు పుట్టెను ఈ లోకంలో
ఆనందమే గొప్ప ఆనందమే (2)
ఆనందమే గొప్ప ఆనందమే
సంతోషమే సర్వలోకమే (2)
||ఆ రాజే||
యెష్షయి మొద్దున - దావీదు చిగురుగా
లోక రక్షకుడు జన్మించెను
లోక పాపాలను కడిగి వేయగా
భువిలో బాలుడిగా అరుదించెను (2)
పరిశుద్ధాత్మ మూలముగా జన్మించెను
మన పాపాలకు విరుగుడు మందును తెచ్చెను (2)
||ఆనందమే||
వీనుల విందుగా - దీనుల అండగా
కరుణా కారకుడు కడలివచ్చెను
పాపుల శాపాలను తానే మోయగా
పరమ పాలకుడు పుడమి చేరెను (2)
కుల మత బేధాలను హరియించ వచ్చెను
పరలోకానికి చేర్చే మార్గమై తనే నిలిచెను (2)
||ఆనందమే||
